సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్‌ | Minister Kakani Govardhan Reddy Comments On Somireddy | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్‌

Apr 26 2024 8:48 PM | Updated on Apr 26 2024 8:48 PM

Minister Kakani Govardhan Reddy Comments On Somireddy

సాక్షి, నెల్లూరు జిల్లా: సోమిరెడ్డి నీతిమాలిన మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని.. అందుకే మాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్‌ఐఆర్‌లో మా పేరు ఉందని నిరూపించగలరా..?. గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయ్యిందా.. లేక టీడీపీ వచ్చిన తర్వాత కేసు బుక్ అయ్యిందా..? చెప్పే దమ్ము నీకు ఉందా?. మద్యం దొరికిన రైస్‌మిల్‌ ఓనర్‌కి, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా..?’’ అంటూ మంత్రి కాకాణి సవాల్‌ విసిరారు.

‘‘ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.. ఓటర్లకి డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డీస్ క్వాలిఫై చెయ్యమని సీఈసీకి ఫిర్యాదు చేశాను. సోమిరెడ్డి సంస్కారంగా బతకడం నేర్చుకోవాలి..ఎక్కడో మద్యం దొరికితే డాన్ని కూడా నాకు ఆపాదిస్తారా..?. మా ఎలక్షన్ కూడా సోమిరెడ్డే చేస్తున్నాడు.. నేను ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతున్నాడు’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement