Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే: మంత్రి కాకాణి

May 6 2023 2:56 PM | Updated on May 6 2023 3:35 PM

Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని.. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు రైతులతో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.

సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని.. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు రైతులతో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతి రైతులకు బీమా ద్వారా రక్షణ కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.

‘‘రైతులకు 100 శాతం బీమా ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్మును దారి మళ్లించారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా సొమ్ము రైతులకు అందించాం. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం’’ అని మంత్రి గోవర్థన్‌రెడ్డి అన్నారు.
చదవండి: ‘38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇది’

Advertisement
 
Advertisement
Advertisement