‘స్టార్‌ చంద్రు’.. రెండో దశ పోలింగ్‌లో రిచ్‌ ఈయనే.. | Lok Sabha Election 2024 Phase 2 Richest Candidate | Sakshi
Sakshi News home page

‘స్టార్‌ చంద్రు’.. రెండో దశ పోలింగ్‌లో రిచ్‌ ఈయనే..

Apr 26 2024 7:58 AM | Updated on Apr 26 2024 8:00 AM

Lok Sabha Election 2024 Phase 2 Richest Candidate

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ శుక్రవారం జరుగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు , కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 6 సీట్లు, అస్సాం, బీహార్‌లలో 5 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లో మూడు సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది.

అత్యంత ధనిక అభ్యర్థులు వీళ్లే..

  • అభ్యర్థుల ఎలక్షన్‌ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్‌ వాచ్‌ చేసిన విశ్లేషణ ప్రకారం.. 'స్టార్ చంద్రు'గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణే గౌడ ఫేజ్ 2 పోలింగ్‌లో అత్యంత ధనవంతుడు. హెచ్‌డీ కుమారస్వామిపై పోటీ చేస్తున్న ఈయన రూ.622 కోట్ల ఆస్తులను ప్రకటించారు .
  • ఇక రూ. 593 కోట్లతో రెండవ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. ఈయన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు.
  • మథుర లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని రూ. 278 కోట్ల ఆస్తులతో మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉన్నారు.
  • మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు .
  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.217.21 కోట్లు.

వీళ్లే పేద అభ్యర్థులు

  • మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ఆయన కేవలం రూ.500 విలువైన ఆస్తులను ప్రకటించారు.
  • రెండో స్థానంలో కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్న మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ రూ.1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. 
  • అమరావతి (SC) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ప్రవేశించిన పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఈయన మొత్తం ఆస్తులు రూ.1,400. 
  • రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నాయకుడు షహనాజ్ బానో రూ. 2,000 ఆస్తులను ప్రకటించారు. 
  • కేరళలోని కొట్టాయం నుండి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరపున పోటీ చేస్తున్న వీపీ కొచుమోన్ రూ.2,230 ఆస్తులతో జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement