‘రాజకీయ రాబంధులా చంద్రబాబు వాలిపోయాడు’ | Kurasala Kannababu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘రాజకీయ రాబంధులా చంద్రబాబు వాలిపోయాడు’

May 6 2023 5:44 PM | Updated on May 6 2023 6:17 PM

Kurasala Kannababu Comments On Chandrababu - Sakshi

సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీని డ్రామా కంపెనీలా చంద్రబాబు నడుపుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు దిగజారుడు భాష వాడుతున్నారు. సీఎం జగన్‌పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కరువుతో అల్లాడిపోయిందని కన్నబాబు అన్నారు.

‘‘అకాల వర్షాలకు పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈలోపే రాజకీయ రాబంధులా చంద్రబాబు వాలిపోయాడు. రైతు బాంధువుడిలా ఫోజులు కొడుతూ సిఎం జగన్‌కు శాపనార్ధాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. చంద్రబాబు దరిద్రం వల్లే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. చంద్రబాబు పూర్తి ఒత్తిడిలో ఉన్నాడు. జగన్‌ సీఎం అయ్యాక రైతులు సంతోషంగా ఉన్నారు. పరామర్శల పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను విస్మరించారు’’ కన్నబాబు  దుయ్యబట్టారు.
చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement