సీఎం రేవంత్‌ షాడో కేబినెట్‌లో ఆ నలుగురు: కేటీఆర్‌ | Ktr Interesting Comments On Cm Revanthreddy Brothers | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ షాడో కేబినెట్‌లో ఆ నలుగురు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Jul 27 2024 7:16 PM | Updated on Jul 27 2024 8:14 PM

Ktr Interesting Comments On Cm Revanthreddy Brothers

సాక్షి,హైదరాబాద్‌:  తెలంగాణలో షాడో కేబినెట్ నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో శనివారం(జులై 27) మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌లో మాట్లాడారు. 

సీఎం రేవంత్‌ సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఉదయ సింహ, అజిత్ రెడ్డితో షాడో కేబినెట్ నడుస్తోందన్నారు. మిగతా వాళ్ళంతా డమ్మీలే అని ఎద్దేవా చేశారు.

సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తమ వద్దకు అన్ని వివరాలు వస్తున్నాయని చెప్పారు. అన్నీ బయటపెట్టడానికి టైమ్‌ ఉందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement