కేసీఆర్‌ గొంతు నొక్కే కుట్ర

KTR files nomination for fifth time from Sircilla Assembly - Sakshi

తెలంగాణపై ఢిల్లీ నేతల దండయాత్ర: మంత్రి కేటీఆర్‌ 

వారి కుట్రలు, కుతంత్రాలకు ప్రజలు లొంగవద్దు 

అంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపు 

సిరిసిల్లలో నామినేషన్‌ వేసిన కేటీఆర్‌.. కొడంగల్‌లో రోడ్‌షో 

సిరిసిల్ల/ కొడంగల్‌: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్‌ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్‌ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు.  

కేసీఆర్‌ సీఎం కావడం ఖాయం
సీఎం కేసీఆర్‌ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం.  బీఆర్‌ఎస్‌ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 

రేవంత్‌ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు 
టీపీసీసీ చీఫ్, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్‌ అని కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్‌ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్‌ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్‌ను ఏనాడూ పట్టించుకోని రేవంత్‌రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్‌రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్‌ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 

కేటీఆర్‌ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్‌ వేసిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్‌ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్‌ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్‌ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-11-2023
Nov 23, 2023, 15:17 IST
ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ సంపదను మేం పెంచేలా చూస్తున్నాం, కానీ.. 
23-11-2023
Nov 23, 2023, 14:04 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది....
23-11-2023
Nov 23, 2023, 13:39 IST
ప్రాజెక్టుల విషయంలో ఇలా జరగడం సహజం. ఆ మాత్రం దానికే విమర్శలు చేయడం.. 
23-11-2023
Nov 23, 2023, 12:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల...
23-11-2023
Nov 23, 2023, 12:24 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే...
23-11-2023
Nov 23, 2023, 12:17 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని...
23-11-2023
Nov 23, 2023, 11:53 IST
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్‌ తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు....
23-11-2023
Nov 23, 2023, 11:46 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ...
23-11-2023
Nov 23, 2023, 11:39 IST
వికారాబాద్: మండల పరిధిలోని గ్రామాల్లో కారు, హస్తం నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు...
23-11-2023
Nov 23, 2023, 10:05 IST
మహబూబ్‌నగర్‌: చిచ్చా బాగున్నావా.. మావా ఎక్కడ పోతున్నావ్‌.. ఓ అక్కా నీ బిడ్డ మంచిగ చదువుతుండా.. మొన్న వడ్లు ఎన్ని...
23-11-2023
Nov 23, 2023, 10:01 IST
నాకు ఇవే చివరి ఎన్నికలట. జగిత్యాలకు నేనేం చేయలేదట. మరి అభివృద్ధి విషయంలో.. 
23-11-2023
Nov 23, 2023, 09:55 IST
సాక్షి, మెదక్‌: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడు రోజులే గడువు ఉంది. అయితే 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి దీంతో...
23-11-2023
Nov 23, 2023, 09:47 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
23-11-2023
Nov 23, 2023, 09:38 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి వినూత్న మార్పులు కనిపిస్తున్నాయి. నాడు అభ్యర్థులు కాలినడకన గ్రామాలను చుట్టేసేవారు. ఆ తర్వాత ఎడ్లబండ్లు,...
23-11-2023
Nov 23, 2023, 08:41 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: ప్రజలు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో దొరను...
23-11-2023
Nov 23, 2023, 07:48 IST
సాక్షి, ఆదిలాబాద్‌: 'జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవీఎంలు, ఎన్నికల అధికారుల ర్యాండమైజేషన్‌ను పూర్తి చేసి...
23-11-2023
Nov 23, 2023, 04:10 IST
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్‌/నల్లగొండ: ‘తెలంగాణలో మీరు అనుకున్న అభివృద్ధి జరగలేదు. ఇక్కడి సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు....
23-11-2023
Nov 23, 2023, 04:00 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్‌ఎస్‌కు...
23-11-2023
Nov 23, 2023, 03:54 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రానందునే వివిధ పథకాలు ఆలస్యం అయ్యాయని సీఎం కేసీఆర్‌ చెబుతున్న మాటలు...
23-11-2023
Nov 23, 2023, 03:45 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/వికారాబాద్‌: ఎన్నికలు వచ్చాయంటే రకరకాలుగా ఆగం చేసే పనులు జరుగుతాయని.. ఒక్కసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే ఐదేళ్లపాటు... 

Read also in:
Back to Top