‘మా నాయకుడు కుప్పంలో చుక్కలు చూపించారు’ | Kodali Nani Slams On Chandrababu Over Winning Of Panchayat Election | Sakshi
Sakshi News home page

‘మా నాయకుడు కుప్పంలో చుక్కలు చూపించారు’

Feb 22 2021 2:04 PM | Updated on Feb 22 2021 3:58 PM

Kodali Nani Slams On Chandrababu Over Winning Of Panchayat Election - Sakshi

టీడీపీ తమ్ముళ్లకు నాదో సలహా.. బాబు పిచ్చితో తెలంగాణాలో టీడీపీని భూస్థాపితం చేశాడు. ఇప్పటికైనా ఆయన్ని తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలన్నారు. లేదంటే ఏపీలో కూడా పార్టీ భూస్థాపితమే అవుతుందని జోస్యం చెప్పారు.

సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం గెలుపు ఎక్కడ వచ్చిందో చంద్రబాబు చెప్పాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, గెలిచిన 42 శాతం అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని సవాల్‌ చేశారు.  ఆయన్ని టీడీపీ నేతలు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పంపడం ఖాయమని  మంత్రి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..   ‘మా నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ చంద్రబాబుకు కుప్పంలో కూడా చుక్కలు చూపించారు. కుప్పంలోనే మేము 75 స్థానాలు గెలిస్తే ఇక బాబు ఎక్కడ 42 శాతం గెలిచినట్టు. చంద్రబాబు పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలి.  ఆయన జూమ్‌యాప్‌‌లో కూర్చుని పగటి కలలు కంటున్నారు.

టీడీపీ తమ్ముళ్లకు నాదో సలహా.. బాబు పిచ్చితో తెలంగాణాలో పార్టీని భూస్థాపితం చేశారు. ఇప్పటికైనా ఆయన్ని తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలి. లేదంటే ఏపీలో కూడా పార్టీ భూస్థాపితమే అవుతుంది. గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ఇక పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాదే. రాష్ట్రంలోఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం’ అని మంత్రి పేర్కొన్నారు.


చదవండి: ‘ఏదో సాధించాలని చతికిలపడ్డారు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement