Kodali Nani Open Challenge To Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

ప్రమాణం చేయగలవా..? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్‌

Nov 10 2022 3:52 PM | Updated on Nov 10 2022 4:43 PM

Kodali Nani Challenge To Chandrababu - Sakshi

2004-19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్‌ వసూలు చేశాడని మండిపడ్డారు.

సాక్షి, కృష్ణా జిల్లా: లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని.. అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? అంటూ చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2004-19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్‌ వసూలు చేశాడని మండిపడ్డారు.

‘‘చంద్రబాబుకు జీవిత కాలం సమయం ఇస్తున్నాం. పులివెందులలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలరా?. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తాడు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు. ఎన్నికల తర్వాత పవన్‌ జెండా పీక్కొని పారిపోతాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ‘జగన్‌ దెబ్బకు చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ రాజకీయ అనాధలుగా మిగిలారు. జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకు అంకితం చేశాడు. రాష్ట్రంలో సమస్యలు లేకనే ఇప్పటంపై విపక్షాల రాద్ధాంతం’’ అని కొడాలి నాని మండిపడ్డారు.
చదవండి: సీఎం జగన్‌ విశాఖ పర్యటన.. షెడ్యూల్‌ ఇలా.. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement