CM YS Jagan And PM Modi Visakhapatnam Tour Full Schedule And Latest News - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ విశాఖ పర్యటన.. షెడ్యూల్‌ ఇలా.. 

Nov 10 2022 2:44 PM | Updated on Nov 10 2022 3:57 PM

CM YS Jagan And PM Modi Visakhapatnam Tour Schedule - Sakshi

రాత్రి పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 9.40 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు.

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో జరగనున్న పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారు. 11వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు.

రాత్రి పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 9.40 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 నుంచి 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 12.20కి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకొని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45లకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.
చదవండి: ‘చంద్రబాబు హయంలో మాయాబజార్‌ చూపించారు’

Advertisement
 
Advertisement
Advertisement