లోకేష్‌-అమిత్‌షా భేటీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy Sensational Comments On Lokesh Amit Shah Meeting - Sakshi

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌​‍ ఇటీవల అమిత్‌షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్‌ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  అమిత్‌షాను పదేపదే అపాయింట్‌మెంట్‌ అడిగింది లోకేషేనని తెలిపారు. ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్‌ పలుమార్లు అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం విజ్ఞప్తి చేశారని చెప్పారు.

తొలుత హోంమంత్రి బిజీ షెడ్యూల్‌ కారణంగా లోకేష్‌ను కలవలేదన్నారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్రమంత్రిగా తాను ఆ సమావేశానికి హాజరయ్యానని వివరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే తనను అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారని లోకేష్‌ గతంలో చెప్పడంతో ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా చాలామందిని కలుస్తారని, ప్రత్యర్థులు అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇస్తారని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top