కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు వర్గానికి చెందిన ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కుమారుడు బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తీసుకున్న ఓ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి తాను అందుకున్న అన్ని కానుకలను తిరిగి ఇస్తానని బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్‌లో తెలిపారు.
రెండేళ్ల క్రితం తన పెళ్లి సందర్భంగా తన భార్యకు మమతా బెనర్జీ ఇచ్చిన బంగారు హారం, దుర్గాపూజ సమయంలో తనకు ఇచ్చిన పంజాబీ-పైజామా దుస్తులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీసింది.
ఇది తన మనస్సాక్షికి సంబంధించిన విషయం అని బైద్యనాథ్ ఘోష్ చెప్పారు. "ఆ ఆప్యాయతకు నేను కృతజ్ఞుడిని. అయితే ఇటీవలి పరిణామాల దృష్ట్యా, నా మనస్సాక్షి చెప్పింది విని ఈ కానుకలను తిరిగి ఇవ్వడం సముచితమని భావిస్తున్నాను" అని పోస్టులో బైద్యనాథ్ ఘోష్ పేర్కొన్నారు.
"ఆ హారం బ్యాంకు లాకర్‌లో ఉంది. గత రెండేళ్లలో ఆ బంగారు హారం విలువపై వచ్చిన వడ్డీకి సమానమైన మొత్తాన్ని జత చేసి ఈ కానుకలన్నీ తిరిగి ఇస్తాను. వీలైనంత త్వరగా వాటిని ఆమె కాళీఘాట్ నివాసానికి పంపిస్తాను" అని తర్వాత మీడియాతోనూ చెప్పారు.
మమతతో పాటు సౌగత రాయ్, కల్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, సోనాలి గుహ సహా కొందరు టీఎంసీ నేతలు తనపై, తన కుటుంబంపై పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని బైద్యనాథ్ ఆరోపించారు. తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల విషయంలో మమత, టీఎంసీకి చెందిన పలువురు సీనియర్ నేతలను బహిరంగ క్షమాపణ కోరుతూ న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
ఈ వివాదంపై స్పందించిన సౌగత మాట్లాడుతూ.. "కాకోలి కుమారుడు చేసిన ఈ వ్యాఖ్యలు చిన్నపిల్లల తరహాలో ఉన్నాయి, ఆధారరహితమైనవి. మమతా బెనర్జీకి కానుకలు తిరిగి ఇవ్వాలన్న అతని నిర్ణయం హాస్యాస్పదం. నాకు ఏదైనా న్యాయపరంగా నోటీసు వస్తే, తగిన విధంగా స్పందిస్తాను" అని అన్నారు.
బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్‌లో చేసిన పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. కానుకలు తిరిగి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టైమింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు ఈ చర్యను హాస్యాస్పదంమని పేర్కొనగా, మరికొందరు ఇది రాజకీయ ప్రేరణతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. బైద్యనాథ్‌పై చాలామంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
I am returning the gold necklace gifted to my wife at our wedding and the kurta-pyjama gifted to me during Durga Puja by @MamataOfficial.
I remain grateful for the gesture, but in view of recent events and as a matter of personal conscience , appropriate to return these gifts.— Dr Baidyanath Ghosh (@DrBaidyanathGh1) June 14, 2026
Stupidity at its peak.... Showing off to people that u r returning the gifts, what's the use of it .... Tell ur mother to return the MP seat also.... But at that ur morality will doom.... Ur family gained soooo many things in all those years & u r acting here.... Have some shame
— Dr Madzzz (@DrMadzz0708) June 15, 2026
Are you also returning all those cut money collected during her tenure as the MP ? just curious to know
— Fish Oil (@machertel) June 14, 2026


