ఏలూరు జిల్లా: జిల్లాలోని కొయ్యలగూడెంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన మండల జనరల్ సెక్రెటరీ గొలిశెట్టి శ్రీనివాస్, ఆయన సతీమణి లక్ష్మీతో సహా ఆ పార్టీకి చెందిన వంద మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. జనసేన పార్టీలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లేదని అందుకే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు గొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: కర్రలు, రాళ్లతో టీడీపీలోని రెండు వర్గాలు దాడులు


