వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌ | YSRCP slams irregularities in the Medical and Health Department | Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌

Nov 15 2026 7:33 PM | Updated on Nov 15 2026 7:38 PM

YSRCP slams irregularities in the Medical and Health Department

తాడేపల్లి : వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. మంత్రి సత్యకుమార్‌ను ప్రశ్నిస్తూ ట్రూత్‌ బాంబు పేరిట ట్వీట్‌ చేసింది వైఎస్సార్‌సీపీ.  చక్కా శ్రీకాంత్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టులో నియమించడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టుకు తొలుత ప్రభుత్వ కళాశాలల ప్రొఫెసర్లకే అవకాశం కల్పించి, ఆ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీల వారికీ అవకాశం ఇచ్చేలా అర్హతలను ఎందుకు మార్చారని ధ్వజమెత్తింది. 

ఆ మార్పు తర్వాత స్విమ్స్ ప్రొఫెసర్ చక్కా శ్రీకాంత్‌ను 01.01.2026 నాటి జీవో ఆర్‌టీ నంబర్ 2 ద్వారా ఏడాదిపాటు నియమించారని, ఆయనకు అవకాశం కల్పించేందుకే అర్హతలను మార్చారా? అని నిలదీసింది. ‘ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు?

వారిలో శ్రీకాంత్‌నే ఎందుకు ఎంపిక చేశారు?, అర్హతల సవరణ నోట్‌ఫైలును, ఎంపిక కమిటీ నివేదికను బ‌యట పెట్ట‌గ‌ల‌రా?, ఏడాది పదవీకాలం పూర్తికాకముందే 12.11.2026 నాటి జీవో ఆర్‌టీ నంబర్ 978 ద్వారా 05.01.2027 నుంచి మరో రెండేళ్లు డిప్యూటేష‌న్‌ను ఎందుకు పొడిగించారు?, అధికారిని కొనసాగించేందుకు చూపిన శ్రద్ధ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించింది. 

 

ఇదీ చదవండి: సర్పంచ్ ఎన్నికలలోనూ చంద్రబాబు తలదూర్చటం సిగ్గుచేటు: టీజేఆర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement