హర్యానా ఎన్నికలు.. ఆప్‌ తొలి జాబితా | Haryana poll list AAP releases first list of candidates | Sakshi
Sakshi News home page

హర్యానా ఎన్నికలు: 20 మంది అభ్యర్థులతో ఆప్‌ తొలి జాబితా

Sep 9 2024 3:58 PM | Updated on Sep 9 2024 4:23 PM

Haryana poll list AAP releases first list of candidates

చంఢిఘడ్‌: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ షాక్‌ ఇచ్చింది. ఓవైపు.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 మంది అభ్యర్థులతో ఆప్‌ తొలి జాబితా విడుదల చేసింది. 

కలయత్ నుంచి అనురాగ్ ధండా, మెహమ్ నుంచి వికాస్ నెహ్రా, రోహ్ తక్ నుంచి బిజేందర్ హుడాను ఆప్‌ బరిలోకి దించించింది. కాంగ్రెస్‌తో చర్చలవేళ ఆప్‌ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
 

పొత్తుపై కాంగ్రెస్‌, ఆప్‌ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్‌ చీఫ్‌ సుశీల్‌ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్‌ యూనిట్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

చదవండి: 90 స్థానాల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్‌కు ఆప్‌ అల్టిమేటం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement