గ్రూప్‌-1 సమస్యపై రాహుల్‌ గాంధీ స్పందించాలి: హరీష్‌ రావు | harish rao slams on congress over group-1 students | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1 సమస్యపై రాహుల్‌ గాంధీ స్పందించాలి: హరీష్‌ రావు

Oct 19 2024 12:30 PM | Updated on Oct 19 2024 12:57 PM

harish rao slams on congress over group-1 students

సిద్దిపేట, సాక్షి: గ్రూప్‌-1 అభ్యర్థుల ఆర్తనాదాలు కాంగ్రెస్‌కు వినిపించటం లేదా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావు ప్రశ్నించారు.  ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. 

‘‘గ్రూప్‌-1 అభ్యర్థులు సమస్యలపై రాహుల్‌ గాంధీ స్పందించాలి. జీవో 29లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యర్థులు అన్యాయం అవుతారు. రైతులు, ఉద్యోగులను నిరుద్యోగులను దగా చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని  వర్గాలను మోసం చేస్తోంది.  ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చావు కబురు చల్లగా చెప్పారు. 

.. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ముక్కు నేలకు రాయాలి. మాట తప్పినందుకు.  మూసి కోసం రూ. లక్షా 50 వేలు ఉంటాయి. కానీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేవా? రుణమాఫీ విషయంలో మోసం చేశావు. బోనస్ విషయంలో మోసం చేశావు. ఇప్పుడు రైతు బంధు విషయంలో మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిస్తున్నాం’’ అని అన్నారు.

చదవండి: కేటీఆర్‌ వల్లే బీఆర్‌ఎస్‌కు ఇలాంటి పరిస్థితి: బండి సంజయ్‌

Advertisement
 
Advertisement
Advertisement