కాంగ్రెస్‌ది 420 మేనిఫెస్టో 

Harish Rao comments ovre Congress Party - Sakshi

మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

కర్ణాటకలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు 

ప్రజలు కొడతారన్న భయంతో 24 గంటల కరెంట్‌ను చేర్చారు 

ఈటల విమర్శలపై ఆగ్రహం 

గజ్వేల్‌ నియోజకవర్గంలో రోడ్‌షోలు, ఆత్మీయ సమ్మేళనాలు 

గజ్వేల్‌/ సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ 420 మేనిఫెస్టోతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రోడ్‌ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2009లో కాంగ్రెస్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు.

ప్రస్తుతం కొన్ని బీఆర్‌ఎస్‌ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చారని చెప్పారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, వాటిని తెలంగాణలో అమలుచేస్తారంటే ప్రజలు నమ్మేస్థితిలో లేరని అభిప్రాయపడ్డారు. ప్రజలు కొడతారని భయపడి మేనిఫెస్టోలో 24 గంటల కరెంట్‌ను చేర్చారని ఎద్దేవా చేశారు. పార్టీ మారగానే బీజేపీ నేత ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుల తెలంగాణగా మార్చారని అంటున్న ఈటల.. ఆనాడు రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉండి సంతకం చేస్తేనే కదా అప్పులు వచ్చింది అంటూ మండిపడ్డారు. గజ్వేల్‌ కోసం ఈటల ఏం చేశారో ఒక్కసారి చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే ఒక్కనాడన్నా వచ్చి వారి ఇబ్బందులు తెలుసుకున్న పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గెలిచే దాకా ఒక్క చాన్స్‌ ప్లీజ్‌.. ఆ తర్వాత ఎక్స్‌క్యూజ్‌మీ అంటారు
ఆరు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చే సేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు పన్నుతోందని హరీ శ్‌రావు విమర్శించారు. తెలంగాణ అమర వీరులను కించపరిచేలా ఆ పార్టీ నాయకుడు చిదంబరం మా ట్లాడటం దారుణమన్నారు. పూర్తిగా విఫలమైన కర్ణాటక లాంటి కాంగ్రెస్‌ పాలన కావాలో, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.

శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ, రాహాల్‌ గాంధీ వైఖరి ఎన్నికలప్పుడు ఓడ మల్లన్న, ఆ తర్వాత బోడ మల్లన్న మాదిరి ఉంటుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభు త్వం విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వడం లేదని, కొత్త ఉద్యోగాలు లేవని అన్నారు. అభివృద్ధికి నిధులివ్వని కాంగ్రెస్‌ సర్కార్‌ తీరుపై కర్ణాటకలో ఎమ్మెల్యేలే వీధులకెక్కే పరిస్థితి వచ్చిందన్నారు.

అక్కడ 6 నెలల పాలనలోనే 357 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. వెలుగుల దీపావళి కావాలా? కర్ణాటక లాంటి చీకటి కావాలో.. తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. గెలిచే దాకా ఒ క్క చాన్స్‌ ప్లీజ్‌ అంటారు, ఆ తర్వాత ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్‌ అంటారు. ఒక్క చాన్స్‌ అంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top