ముఖ్యమంత్రా.. చెడ్డీగ్యాంగ్‌ లీడరా? | Harish Rao comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రా.. చెడ్డీగ్యాంగ్‌ లీడరా?

Apr 11 2024 4:35 AM | Updated on Apr 11 2024 4:35 AM

Harish Rao comments over Revanth Reddy - Sakshi

రేవంత్‌రెడ్డివి దిగజారుడు మాటలు: ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజం  

పటాన్‌చెరుటౌన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటతీరు చూస్తుంటే ముఖ్యమంత్రా..? లేక చడ్డీగ్యాంగ్‌ లీడరా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో గణేశ్‌గడ్డ దేవస్థానం వద్ద ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కోరితే.. ‘చడ్డీ విప్పుతా.. డ్రాయర్‌ విప్పుతా’ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఇదేం భాషో అర్థం కావడం లేదన్నారు.

రేవంత్‌ భాషను ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫేక్‌ వార్తలు, లీక్‌ వార్తలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, కానీ, ఆ ఆటలు సాగవని..మెదక్‌ గడ్డ బీఆర్‌ఎస్‌కు అడ్డా అని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement