
బనశంకరి: ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని, అలాంటప్పుడు ఎలా వెళ్లాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఇంతవరకు ఇలాంటి రాజకీయాలు చేయలేదని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జీ20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలకు ఆహా్వనం ఇవ్వకపోవడం వంటి పనికిమాలిన రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పొత్తుపై పత్రికల్లో చూశానని, దేవెగౌడ, నరేంద్ర మోదీ చేతులు కలపడం చూశానని అన్నారు. ఇద్దరూ ఒకటి కావడానికి ప్రయతి్నస్తున్నారని, వారి మధ్య సీట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. కానీ, వారు కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని చెప్పారు. సనాతన ధర్మం విషయంలో రాజకీయాలు తీసుకురాకూడదని, అందరూ ఒక్కటే అనే భావనతో వెళ్లాలని సూచించారు.