నిండా ముంచేసి.. అరకొర సాయమంటే ఎలా బాబూ?: వైఎస్సార్‌సీపీ | Ex Mla Malladi Vishnu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

నిండా ముంచేసి.. అరకొర సాయమంటే ఎలా బాబూ?: వైఎస్సార్‌సీపీ

Sep 18 2024 4:59 PM | Updated on Sep 18 2024 5:48 PM

Ex Mla Malladi Vishnu Comments On Chandrababu

వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్‌ అప్రమత్తం చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.

సాక్షి, తాడేపల్లి: వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్‌ అప్రమత్తం చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రభుత్వంలోని పెద్దల తప్పిదాన్ని అధికారులపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మేము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాం.. రూ.7 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని భావిస్తున్నాం.. ప్రభుత్వం రూ.700 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది.’’ అని దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రజలను ముంచేసింది. కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. ఇల్లు మునిగితే రూ.25 వేలు ఇస్తే ఏ మూలకి సరిపోతుంది?. ఫర్నీచర్ విలువ, వాహనాల విలువ చంద్రబాబుకు తెలుసా?. బాధితుల కష్టాలు చూసి జగన్ చలించిపోయారు. అందుకే మా వంతుగా బాధితులకు సాయం అందించాం.  ప్రభుత్వం రైతులకు పదివేలు ఇస్తే ఏం సరిపోతుంది?. చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీని పెంచాలి. ఆస్తి పన్నును రద్దు చేయాలని కోరతున్నాం. ఒక నెల కరెంటు బిల్లును పూర్తిగా రద్దు చేయాలి.

ఇదీ చదవండి: పవన్‌.. గొంతు ఎందుకు పెగలడం లేదు?

..నష్టపోయిన ఆటోల స్థానంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి కొత్తవి ఇప్పించాలి. రెండు లక్షల వడ్డీలేని రుణాలను చిన్న పరిశ్రమల వారికి ఇప్పించాలి. చంద్రబాబు వైఖరి వలన 60 మంది పైనే చనిపోయారు. 7 వేల కోట్ల నష్టం జరిగితే 7 వందల కోట్లతో సరిపెట్టేలా చూడటం భావ్యం కాదు. వరదల వైఫల్యానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు.

నిండా ముంచి ఇప్పుడు పాతిక వేలు ఇస్తామంటే ఎలా?: దేవినేని అవినాష్‌
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ, వరద బాధితులకు సహాయం చేయటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. మా పార్టీ తరపున ప్రతి ఇంటికీ సాయం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చేయలేక పోతోంది?. నిండా ముంచి ఇప్పుడు పాతిక వేలు ఇస్తామంటే ఎలా కుదురుతుంది?. పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంటికీ కనీసం యాభై వేలు చొప్పున ఇవ్వాలి’’ అని దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు.

7 వేల కోట్లు నష్టం..700 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement