కరీంనగర్‌లో కేసీఆర్‌ పొలంబాట.. రైతులకు పరామర్శ | Ex CM KCR Karimnagar District Tour Live Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

KCR Karimnagar Tour Updates: కరీంనగర్‌లో కేసీఆర్‌ పొలంబాట.. రైతులకు పరామర్శ అప్‌డేట్స్‌

Apr 5 2024 11:06 AM | Updated on Apr 5 2024 3:01 PM

Ex CM KCR Karimnagar District Tour Live Updates - Sakshi

మాజీ సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా పర్యటన..

Live Updates..

► కరీంనగర్‌లో కేసీఆర్‌ పొలంబాట
కరీంనగర్‌ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్‌
జిల్లాలోని మొగ్దుంపూర్‌లో ఎండిపోయిన పంటను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. 

ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్‌ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్‌ ముందుగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement