3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల | by elections schedule in bihar madhya pradesh gujarat | Sakshi
Sakshi News home page

3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Jul 2 2026 2:47 PM | Updated on Jul 2 2026 3:21 PM

by elections schedule in bihar madhya pradesh gujarat

ఢిల్లీ: బిహార్‌లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్‌లోని దటియ, గుజరాత్‌లోని మంజల్పూర్ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని బంకీపూర్ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. 


 
అసెంబ్లీ ఉపఎన్నికలకు జులై 6 నుంచి జులై 13 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఆ తర్వాత జులై 14న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. జులై 16 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న కౌంటింగ్ ఉంటుంది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement