 
													
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థ ను రూపొందించిన వ్యక్తి జగన్ అని, దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదని అమర్ అన్నారు.
సాక్షి, సత్తెనపల్లి: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన "మేనిఫెస్టో అంటే జగన్" చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
"జగన్ 650 హామీలు ఇచ్చారని, అందులో 20 శాతం కూడా అమలు చేయలేదంటూ టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేస్తోందట. కాంగ్రెస్ నినాదం గరీబీ హఠావో అమలు కాలేదు. సమాజమే దేవాలయం అన్న టీడీపీ 20 ఏళ్లు పాలించింది. అయినా రాష్ట్రంలో పేదరికం ఇంకా ఎందుకు ఉంది? జగన్ పేదవాడి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టో పెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి గెలుపు జగన్‌కే సాధ్యమైంది. నేను చేసిన సంక్షేమం మీకు అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. జగన్ ఒక భిన్నమైన తత్వవేత్త, ఫిలాసఫర్. ప్రతీ గడపకు నాయకులు అధికారులు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కరించే వ్యవస్థను జగన్ క్రియేట్ చేసారు. ఈ వ్యవస్థలో ఏం జరిగినా క్షణాల్లో జగన్ తెలుసుకుంటారు"
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి  నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థ ను రూపొందించిన వ్యక్తి జగన్ అని, దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదని అమర్ అన్నారు. ఒకప్పుడు సమాజంలో పత్రికలు విశ్వసనీయత కలిగి ఉన్నాయి అని, నేడు సోషల్ మీడియా ద్వారా సత్యం కనుమరుగు అవుతున్నది, వాస్తవాలు ప్రజలకు చేరడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..!
ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని, ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సీఎం పని చేస్తున్నారని అమర్ అన్నారు. అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదు అని, పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుంది అని, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది కేవలం అపోహ మాత్రమే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వివిఆర్ కృష్ణంరాజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
