నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పోలీస్ బందోబస్త్ దృష్ట్యా ఈనెల 16న జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్)ను తాత్కలికంగా రద్దు చేసినట్లు డీపీఓ కార్యాలయపు వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. జిల్లాలోని ప్రజలు గమనించాలని, తద్వారా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాడేపల్లి రూరల్ : రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రానున్నారు. వారి రాకను పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం ఉండవల్లి చిన్నడొంకలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, బిల్‌గేట్స్‌లు రాజధానిలో పలు ప్రాంతాలను పరిశీలించనున్నారని తెలిపారు. ఆ ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో పూర్తిచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యానశాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూ నగర్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు ఆదివారం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. పాలకవర్గ ఎన్నికకు ఆదివారం సెక్రటరీకి 4, వైస్ ప్రెసిడెంట్ 1, ట్రెజరర్‌కి 2, జాయింట్ సెక్రటరీకి 4, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌కు 6 (పురుషులు 5, మహిళలు 1) నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. నామినేషన్లకు 16వ తేదీ చివరి రోజు అని అన్నారు.
గుంటూరు వెస్ట్: వడ్లమూడి వెంకట లక్ష్మమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున తెనాలికి చెందిన డాక్టర్ వడ్లమూడి బాబు రాజేంద్ర ప్రసాద్ , వడ్లమూడి గోపాలకృష్ణయ్యలు ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాకు రూ.10 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ఈ మొత్తం వెచ్చిస్తామన్నారు. పీ4 లో భాగంగా ఈ మొత్తం చెక్కును దాతలు అందజేశారన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీఓ లక్ష్మీకుమారి, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి జెట్టి సౌలరాజు, ప్రతిపాటి సురేష్ పాల్గొన్నారు.
వ్యక్తికి తీవ్ర గాయాలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి గుంటూరు చానల్ పక్కనే ఉన్న నీళ్లులేని కాలువలోకి దూసుకు వెళ్లింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెదకాకానిలో నివాసముండే అనురాగ్ స్థానికంగా పార్శిల్ సర్వీస్‌లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా కొలనుకొండ వద్ద అతని కారు డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి గుంటూరు చానల్ పక్కనే ఉన్న మరో కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైంది. స్థానికులు 108కు, తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి కారులో ఇరుక్కుపోయిన అనురాగ్‌ను బయటకు తీసి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ ఖాజావలి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు


