తరలిన భారీ విద్యుత్‌ ప్రభలు | - | Sakshi
Sakshi News home page

తరలిన భారీ విద్యుత్‌ ప్రభలు

Feb 16 2026 7:33 AM | Updated on Feb 16 2026 7:33 AM

తరలిన

తరలిన భారీ విద్యుత్‌ ప్రభలు

తరలిన భారీ విద్యుత్‌ ప్రభలు

చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీ తిరునాళ్లలో ఆదివారం రాత్రి భారీ విద్యుత్‌ ప్రభలు కాంతులు వెలుగులు నింపాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్ప కొండ తరువాత పేరు గాంచిన చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఈ ఏడాది 15 భారీ విద్యుత్‌ ప్రభలు తరలివచ్చాయి. నారాకోడూరు నుంచి గ్రామ ప్రభ, సెంట్రల్‌ యూత్‌, మిత్రమండలి ప్రభలు వచ్చాయి. సుద్దపల్లి గ్రామ కాపు సంఘం, చేబ్రోలు, గొడవర్రు, గుండవరం, వడ్లమూడి, శలపాడు గ్రామాల నుంచి ప్రభలు తరలివచ్చాయి. నారా కోడూరు మీదుగా వడ్లమూడి క్వారీ దేవాలయం వరకు వెళ్లే మార్గాల వద్ద ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

తరలిన భారీ విద్యుత్‌ ప్రభలు 1
1/1

తరలిన భారీ విద్యుత్‌ ప్రభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement