
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ రూరల్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘‘ లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి సెగ్మెంట్‌లో ప్రధాని మోదీ తప్పించుకున్నారు. లేకపోతే అక్కడ మోదీ స్వయంగా ఓటమి పాలయ్యేవారు. బీజేపీ అయోధ్యలో ఓడిపోయింది. అయోధ్య ప్రజలు హింస, ద్వేశాన్ని తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల ఫలితాల ద్వారా సందేశం ఇచ్చారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
#WATCH | Malappuram, Kerala: Addressing a public meeting, Congress MP from Wayanad Rahul Gandhi says, "The truth is the Prime Minister barely escaped in Varanasi and he would have been defeated himself in Varanasi. The BJP was defeated in Ayodhya. The people of Ayodhya have… pic.twitter.com/PWQt5M0xSu
— ANI (@ANI) June 12, 2024
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ వెళ్లారు. తాను గెలుపొందిన వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎడవన్నా ప్రాంతంలో నిర్వహించిన రోడ్ షోలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. వేల మంది యూడీఎఫ్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తును ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.
అంతకుముందు కోజికోడ్ ఎయిర్‌పోర్టులో దిగిన రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వయనాడ్ పార్లమెంట్ స్థానంలో వరుసగా రెండోసారి రాహుల్ గాంధీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సీపీఐ అభ్యర్థిని అన్నీ రాజాపై 3,64,422 మెజార్టీతో రాహుల్ గెలుపొందారు.