ఖబడ్దార్‌ రేవంత్‌.. కాంగ్రెస్‌ కార్యకర్త పేరుతో పోస్టర్‌ కలకలం | CM Revanth Anti Posters, Tension At Sircilla | Sakshi
Sakshi News home page

ఖబడ్దార్‌ రేవంత్‌.. కాంగ్రెస్‌ కార్యకర్త పేరుతో పోస్టర్‌ కలకలం

Oct 24 2024 10:46 AM | Updated on Oct 24 2024 10:59 AM

CM Revanth Anti Posters, Tension At Sircilla

సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్‌ కార్యకర్త పేరుతో కట్టిన పోస్టర్‌ తీవ్ర కలకలం సృష్టించింది. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మాయమాటలు చెబుతోంది. రేషన్‌ కార్డులు ఇస్తామని ఇంకా ఇవ్వడం లేదు. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే రేషన్‌ కార్డుల విషయంపై ఆలోచించాలని రాశారు.

వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్‌ కార్యకర్త పేరుతో పోస్టర్‌ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్‌లో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తాయని అనుకున్నాం. రేషన్ కార్డు లేక, లేబర్ కార్డ్ రావడం లేదు. ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉన్నాం. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే ముందుగా రేషన్ కార్డు సమస్యను తీర్చండి. గత ప్రభుత్వం మాదిరిగానే మాయమాటలు చెప్పి, ప్రజలకు నమ్మక ద్రోహాన్ని చేయకండి. ఖబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్.. అని పోస్టర్ కట్టారు. దీంతో, ఈ పోస్టర్‌పై ప్రజల్లో చర్చ నడుస్తోంది. అయితే, బీఆర్‌ఎస్‌ నేతలే ఇలా పోస్టర్లు కట్టారంటూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement