ఇంటర్వ్యూకు హాజరవ్వండి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూకు హాజరవ్వండి

Mar 14 2026 7:35 AM | Updated on Mar 14 2026 7:35 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌లోని టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్‌ కోసం గత నెల 24 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు వారి మెరిట్‌ ఆధారంగా ఈనెల 17న ఇంటర్వ్యూకు హాజరు కావాలని కరీంనగర్‌ రీజియన్‌ మేనేజర్‌ బి.రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌ కాపీలతోపాటు 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement