సిరిసిల్లటౌన్: దేశంలో చమురు కొరతపై కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ట్రంపు అరాచకాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపు అధికారుల్లోకి వచ్చిన తర్వాత చిన్నపాటి దేశాలపై ఆధిపత్యం కోసం విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఈనెల 16న ‘చూద్దాం వద్దు కలిసి ఉంటే ముద్దు’ అనే నినాదంతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సీపీఐ తనవంతు పాత్ర పోషిస్తుందని రానున్న రోజుల్లో వారి మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తామన్నారు. మంద సుదర్శన్, గుంటి వేణు, పంతం రవి, కడారి రాములు, పంతం రవి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి


