గోదావరిఖని: అడ్డగుంటపల్లి మేకల మండి వద్ద అతిగా మద్యం సేవించి బూడిది శ్రీనివాస్ (50) అనే ర్యాక్‌పిక్కర్ శుక్రవారం మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాలకు చెందిన శ్రీనివాస్ రామగుండం మున్సిపాలిటీలో ర్యాక్‌పిక్కర్ పనిచేస్తున్నాడు. 11ఏళ్ల క్రితం భార్య విడిచిపెట్టి వెళ్లిపోగా, అప్పటి నుంచి మద్యానికి బానిసై ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉండేవాడు. ఈక్రమంలో గురువారం రాత్రి అడ్డగుంటపల్లెలోని మేకల మండి వద్ద మద్యం సేవించి స్పృహ లేకుండా పడిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడి వెళ్లి చూసేసరికి చనిపోయి ఉన్నాయని అన్నారు. మృతుడి చెల్లి బూడిది తిరుమల ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి పట్టణానికి చెందిన బాస అక్షయ్(24) పురుగుల మందు తాగి నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. అక్షయ్ తల్లిదండ్రులు కొంతకాలం క్రితం మరణించారు. అప్పటి నుంచి ఒంటరితనంతో మానసికంగా కుంగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 10న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే బంధువులు నిజామాబాద్ ఆసుపత్రిలో చే ర్పించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని ఆరపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల వయసు గల ఇనాయ అనే పసికందు మృతిచెందింది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. షేక్ సుమీర్ తన భార్య, తల్లి, అత్త, కూతురు ఇనాయలతో కలిసి ఆటోలో కోరుట్లకు వెళ్తుండగా.. ఆరపేట వద్ద నిస్సాన్ కారును అతి వేగంగా డ్రైవ్ చేస్తూ వెనుకనుంచి ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇనాయ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి.. తర్వాత నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సుమీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
కథలాపూర్(వేములవాడ): కథలాపూ ర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య(56) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసులు తెలి పిన వివరాలు.. నర్సయ్య కొద్దిరోజులుగా అనారోగ్య ంతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. దీంతో మనస్తాపానికి గురై గ్రామశివారులోని అలిసెగుట్ట వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు.
లైంగిక వేధింపుల కేసు
కరీంనగర్‌క్రైం: నగరంలోని మంకమ్మతోటలో ఉన్న ఏకే అసోసియేట్స్ కాల్ సెంటర్ నిర్వాహకుడు ఎండీ రహూఫ్‌పై లైంగిక వేధింపులు, ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. రహూఫ్ ఆయన సంస్థలో పనిచేసేందుకు ఎనిమిది మంది యువతులను నియమించుకున్నాడు. కొద్దిరోజులగా వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. శక్రవారం బాధితులు కరీంనగర్ షీటీంకు ఫిర్యాదు చేశారు. టూటౌన్‌లో నిందితుడిపై లైంగిక వేధింపులు, ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి దర్యాప్తు చేస్తున్నారు.


