సాక్షి, హైదరాబాద్: అసలు ఏపీలో పరిపాలన జరుగుతుందా? అంటూ కూటమి సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని మోసం చేసిందన్న బుగ్గన.. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్న హామీని కూటమి సర్కార్ గాలికి కొదిలేసిందన్నారు. ఏడాదిన్నర గడిచిన చంద్రబాబు పీఆర్‌సీ ఊసు ఎత్తడం లేదంటూ బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023లో 12వ పీఆర్‌సీ ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చింది. అసలు కూటమి సర్కార్ చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? 2024 నుంచి గ్యాట్యుటీ, మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగులకు ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు. నో పీఎస్ అయ్యింది. ఐదో తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. జనవరి నుంచి పోలీసులకు టీఏ పెండింగ్‌లో ఉంది’’ అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు.


