అమరుల త్యాగాలను మనం గుర్తుచేసుకోవాలి: కవిత | BRS MLC Kavitha Serious On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలను మనం గుర్తుచేసుకోవాలి: కవిత

Jun 2 2025 9:26 AM | Updated on Jun 2 2025 9:54 AM

BRS MLC Kavitha Serious On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోరాటం, రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ అమరవీరులకు కనీసం నివాళులు కూడా అర్పించడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రాష్ట్ర ఆ‍విర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘జాగృతి కొత్త కార్యాలయంలో మొదటి సారి జెండా ఎగురవేసినం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారు. అది మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమ తో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు. అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కనీసం నివాళులు కూడా అర్పించడం లేదు. అమరవీరులకు నివాళులు అర్పించే వరకు మా జాగృతి పోరాటం చేస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement