ఫ్రస్ట్రేషన్‌లో స్థాయిని మించి మాట్లాడుతున్నాడు: కేటీఆర్‌పై లక్ష్మణ్‌ మండిపాటు | BJP MP Laxman Fires On KTR Over His Comments On PM Modi And Union Home Minister Amit Shah - Sakshi
Sakshi News home page

ఫ్రస్ట్రేషన్‌లో స్థాయిని మించి మాట్లాడుతున్నాడు: కేటీఆర్‌పై లక్ష్మణ్‌ మండిపాటు

Oct 11 2023 7:08 PM | Updated on Oct 11 2023 7:26 PM

BJP mp Laxman Fires On KtR Over His Comments On Modi Amit Shah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కేటీఆర్‌ సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. సీఎం కాలేదన్న ఫ్రస్టేషన్‌లో కేటీఆర్‌.. తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి సహకరించకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలు అంటే మద్యం, డబ్బు అయిపోయిందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అవకాశవాద రాజకీయాలని విమర్శలు గుప్పించారు. ఈనెల 16 తర్వాత బీజేపీ లిస్ట్‌ కూడా వస్తుందని లక్ష్మణ్‌ తెలిపారు. అన్ని వర్గాల వారికి బీజేపీ మాత్రమే సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లోపే మేనిఫెస్టో, చార్జి షీట్‌ కూడా విడుదల చేస్తామని చెప్పారు.

‘ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా ఎక్కడ.. కేటీఆర్‌ ఎక్కడ.. పెద్దవారిని తిడితే పెద్దవాన్ని అవుతానని అనుకుంటున్నావా. బీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయి. ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు గుంజుతున్నారు. నదులకు నడక నేర్పడం ఏమో కానీ మద్యాన్ని ఏరులై పారించారు. గుజరాథ్‌కు వెళ్లి చూసి వస్తారు. అదే గుజరాత్ మోడల్‌నీ  ఎగతాళి చేస్తారు. ’ అని లక్ష్మణ్‌ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement