ఇదేం పద్దతి.. కేటీఆర్‌పై రాజాసింగ్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ | BJP MLA Raja Singh Satirical Comments On KTR | Sakshi
Sakshi News home page

ఇదేం పద్దతి.. కేటీఆర్‌పై రాజాసింగ్‌ సెటైరికల్‌ కామెంట్స్‌

Sep 13 2024 3:03 PM | Updated on Sep 13 2024 3:24 PM

BJP MLA Raja Singh Satirical Comments On KTR

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. పని పాట లేక కేంద్రంలో కేటీఆర్‌ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో కేటీఆర్‌ ఆందోళనలో ఉన్నారు. అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని ప్రజలకు ఒక సూచన చేశారు. దాన్ని తప్పు పడుతూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పనేమీ లేకపోవడంతో కేంద్రంపై కేటీఆర్‌ ఏదో ఒక ఆరోపణ చేయాలని ట్వీట్‌ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు మంచి ఫైట్‌ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్‌ కూడా పోరాడాలి. కానీ, ఎక్కడో ఉంది ఇలా ట్వీట్‌ చేయడం కరెక్ట్‌ కాదు. అంతేకాకుండా మధ్యలో వచ్చి మంచి పనులపై ఇలాంటి కామెంట్స్‌ చేస్తే జనాలు మిమ్మల్ని పిచ్చి వాళ్లు అనుకుంటారు’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: లా అండ్‌ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్‌ ఆదేశాలు

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement