నేడు బీజేపీ మేనిఫెస్టో  | Union Home Minister Amit Shah To Release BJP Manifesto On Saturday Evening For Telangana Assembly Elections - Sakshi
Sakshi News home page

TS Elections BJP Manifesto: నేడు బీజేపీ మేనిఫెస్టో 

Published Sat, Nov 18 2023 3:54 AM

BJP manifesto today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం సాయంత్రం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విడుదల చేయనున్నారు. శుక్రవారంరాత్రికే ఆయన నగరానికి చేరుకోవాల్సి ఉండగా మారిన షెడ్యూల్‌ ప్రకారం శనివారం మధ్యాహ్నం రానున్నారు. 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. మధ్యాహ్నం 12.50 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు గద్వాల నుంచి నల్లగొండకు బయలుదేరుతారు.

మధ్యాహ్నం 3.35 గంటలకు నల్లగొండ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు వరంగల్‌ చేరుకుని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. సాయంత్రం 6.10 గంటలకు హోటల్‌ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేస్తారు. సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.  

ఇంటింటికీ మేనిఫెస్టో
బీజేపీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) ఇంటింటికీ చేరేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నట్టు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే వారంపాటు ఎన్నికల ప్రచారసభలను పెద్ద ఎత్తున చేపడతామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హేమంత బిశ్వశర్మ, ప్రమోద్‌ సావంత్‌ ఈ సభల్లో పాల్గొంటారని చెప్పారు. కేసీఆర్‌ పాలనావైఫల్యాలు, కాంగ్రెస్‌ మోసపూరిత హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.   

Advertisement
 
Advertisement