బిహార్‌లో ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు | Bihar Will Give Shocking Results, Tejashwi Yadav To Amit Shah Remark | Sakshi
Sakshi News home page

బిహార్‌లో ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు

Apr 29 2024 5:21 PM | Updated on Apr 29 2024 5:21 PM

Bihar Will Give Shocking Results, Tejashwi Yadav To Amit Shah Remark

ప్రతిపక్ష ఇండియా కూటమి బయపడుతోందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలపై బీహార్‌ రాష్ట్రీయ జనతాదళ నేత, రాష్ట్ర మాజీ సీఎం తేజస్వీ యాదవ్‌ స్పందించారు.

‘లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు షాకింగ్ ఫలితాలు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో మేం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాము. స్వాగతిస్తున్నాము. ప్రధానమంత్రి బీహార్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. కానీ ఏదీ అమలు చేయలేదు’అని తేజస్వీ యాదవ్‌ అన్నారు.

ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఒక్కో సంవత్సరం ప్రాతిపదికన ప్రధాన మంత్రులను ఎన్నోవాలని చూస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలపై అమిత్‌ షా స్పందించారు.

దేశం నడపాల్సిన మార్గం ఇది కాదని, మూడు దశాబ్దాలకు పైగా అస్థిర ప్రభుత్వాలు అధికారంతో దేశం ఇప్పటికే చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లించిందని అన్నారు. ‘ఈ దేశం మూడు దశాబ్దాలుగా అస్థిరతకు మూల్యం చెల్లించింది. అస్థిర ప్రభుత్వాలు మూడు దశాబ్దాలు నడిచాయి. అయితే గత 10 ఏళ్లలో దేశానికి బలమైన నాయకత్వం వచ్చింది. రాజకీయ సుస్థిరత మాత్రమే కాదు, విధానాల్లోనూ స్థిరంగా ఉంది’ అని స్పష్టం చేశారు.

ఇండియా కూటమి అలా కాదు.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే  ఒక ఏడాది  శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం ప్రధానులు బాధ‍్యతలు చేపడతారు. అప్పటికి ఇంకా సమయం ఉంటే రాహుల్‌ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని ఎద్దేవా చేశారు. దేశాన్ని నడిపించే విధానం ఇది కాదు’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement