మరో ఎంపీ లండన్‌లో ఉన్నా​.. నన్ను టార్గెట్‌ చేశారు: స్వాతి మలివాల్‌ | Sakshi
Sakshi News home page

మరో ఎంపీ లండన్‌లో ఉన్నా​.. నన్ను టార్గెట్‌ చేశారు: స్వాతి మలివాల్‌

Published Sun, May 26 2024 7:27 AM

AAP MP Swati Maliwal Reveals Why She Was In USA Over CM Kejriwal Arrest

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసిన సమయంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ ఇండియాలో లేరని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిపై స్వాతి మలివాల్‌ స్పందించారు.

‘‘ హార్వార్డ్‌ యూనివర్సిటీలో ఓ సెమినార్‌ పాల్గొనడానికి నేను మార్చిలో అమెరికా వెళ్లాను.  ఆప్‌ వలంటీర్లు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో​ పాల్గొన్నా. నా సోదరికి కోవిడ్‌ సోకటం కారణంగా నేను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.  అమెరికాలో  ఉన్న భారత్‌లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలతో టచ్‌ ఉన్నాను. 

...ఆప్‌ నేతలతో  ఎప్పటికప్పుడు మాట్లడుతూ.. ట్వీట్లు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నేను చేయగలిగింది చేశాను. ఆ సమయంలో పార్టీ కోసం నేను పని చేయలేదనటం చాలా దురదృష్టకరం. మరో రాజ్యసభ ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఎందుకు టార్గెట్‌ చేశారో అర్థం కావటం లేదు’’ అని పేర్కొన్నారు.

ఇక కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయిన సమయంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా భారత్‌లో లేకపోటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటి శస్త్రచికిత్సకు లండన్‌ వెళ్లి ఇటీవల భారత్‌ తిరిగి వచ్చారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల  ర్యాలీల్లో రాఘవ్‌ పాల్గొంటున్నారు. ఇటీవల (మే 13) సీఎం కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్‌ కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది. ఆమెపై దాడి జరిగినట్లు చేస్తున్న ఆరోపణల వెనక బీజేపీ కుట్ర  ఉందని ఆప్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement