
AP Elections Political Latest Updates Telugu..
8:21 PM, Feb 9, 2024
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్
- ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం
- ఛార్జ్‌షీట్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్న వార్తలను ఖండించిన సీఐడీ
- ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేయబడిన అనుబంధ పత్రాలను పరిశీలించడానికి కొంత సమయం పడుతుందన్న సీఐడీ
- ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్న సీఐడీ
- టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు
- ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీఐడీ
- ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొన్న సీఐడీ
- లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొన్న సీఐడీ
- వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు
- తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధం
6:21 PM, Feb 9, 2024
మైలవరం టీడీపీలో రాజుకున్న టికెట్ పంచాయతీ
- దేవినేని ఉమకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న ఉమా వర్గం
- నారా భువనేశ్వరి వద్ద పంచాయతీ పెట్టిన ఉమా
- వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి మైలవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం
- వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమ వర్గం
04:33 PM, Feb 9, 2024
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కామెంట్స్
- పొత్తులతో ఎన్నికలకు వెళ్లిన పార్టీల్లో నితీష్ కుమార్ తర్వాత ఆ రికార్డ్ చంద్రబాబుకే దక్కుతుంది
- గుంటూరు సభకు వెళ్తుంటే రాహుల్ కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు, కోడిగుడ్లు విసిరించాడు
- తిరుపతిలో అమిత్ షా పై రాళ్లేయించాడు
- రాజకీయ చతురుడు అని చంద్రబాబు తనకి తానే అనుకుంటాడు
- అపవిత్ర రాజకీయంలో చంద్రబాబు రికార్డు ఎవరూ బద్ధలు కొట్టలేరు
- 2019లో చంద్రబాబు దేనికోసం పోరాడారు
- ఏపీ భవన్‌లో ధర్మపోరాట దీక్ష ఏయే ప్రయోజనాలను ఆశించి చేశారు
- ప్రత్యేకహోదా ఎందుకు వద్దన్నారు.. ప్యాకేజీ ఎందుకు ముద్దన్నారు
- స్వీట్లు పంచి.. పండుగ చేసుకుని ఏం సాధించారు
- మోదీ కుటుంబ విషయాల గురించి ప్రస్తావించిన వ్యక్తి చంద్రబాబు
- అందుకే చంద్రబాబుకు మోదీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు
- తాను కలవకుండా అమిత్ షా...నడ్డా వద్దకు పంపించారు
- అభద్రతా భావం కలగగానే చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తొస్తాయి
- ఢిల్లీకి ఎందుకెళ్లారో ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
04:01 PM, Feb 9, 2024
చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని ద్రోహి
- ఇప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడు
- ఇంటికో ఉద్యోగం అన్నాడు చంద్రబాబు.. ఏమైంది దీనికి సమాధానం చెప్పాలి
- డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు చేశాడా?
- ఇప్పుడు మరోసారి హామీలతో వస్తున్నాడు
- అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు అలిపిరి వద్ద కాన్వాయ్‌పై రాళ్లు వేయించింది చంద్రబాబు కాదా?
- చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు
- సీఎం జగన్‌పై అనునిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నాడు
- టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది
- ఇందుకే చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు
02:33 PM, Feb 9, 2024
టీడీపీకి ఒక విధానం అంటూ లేకుండా పోయింది
- ఒక వైఎస్సార్సీపీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు
- సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్న పార్టీలతో సైతం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు
- కాంగ్రెస్, బిజెపి, వామపక్ష పార్టీలకు వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయి
- ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుది
- జనసేన సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదు
- వైఎస్సార్ ఆశయాలు.. పేదల సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ఎజెండా
- టీడీపీకి ఒక ఎజెండా ఒక విధానం లేదు
- సీఎం ఢిల్లీ పర్యటనలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు
- పోలవరం విభజన హామీల అమలకోసమే సీఎం ఢిల్లీ పర్యటన
- బీజేపీ టీడీపీ సంకీర్ణంలో ఉన్నప్పుడు విభజన హామీలను.. టీడీపీ గాలికి వదిలేసింది
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వ్యాఖ్యలు
12:21PM, Feb 9, 2024
గతంలో పవన్‌ను అన్‌పాపులర్ చేసింది రామోజీనే: పోసాని
- చంద్రబాబు.. రామోజీకి నీతిమంతుడిలా కనపడుతున్నాడా?
- కుట్రలతో ఎన్టీఆర్ దగ్గర పార్టీని లాక్కున్నది చంద్రబాబు కాదా?
- వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా?
- పచ్చిగా మాట్లాడటం తప్పుకాదు.. అబద్ధం చెప్పడం తప్పు
- వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారు
- మళ్లీ జగన్ సీఎం అయితే ఏమైపోతారోనని రామోజీకి, బాబుకు భయం
- ఎవరి డబ్బుతో రామోజీ మార్గదర్శి పెట్టారు?
- మార్గదర్శిలో డబ్బంతా రామోజీ పందికొక్కుల్లా తిన్నారు
- చంద్రబాబు మోసాలు చేస్తాడు కాబట్టే జెడ్ సెక్యూరిటీ పెట్టుకుంటాడు
- రామోజీ.. వలంటీర్లపై విష ప్రచారం చేస్తావా?
- మానవత్వం, స్నేహభావం ఉన్నవారే వలంటీర్లు
- రామోజీ, బాబు.. చిరంజీవిని ఇష్టమొచ్చినట్లు తిట్టారు
- ఈనాడు పత్రిక టాయ్‌లెట్ పేపర్‌లా మిగిలిపోతుంది
- చంద్రబాబు అవకాశవాది
- తన స్వలాభం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడు
- గతంలో పవన్‌ను అన్‌పాపులర్ చేసింది రామోజీనే
- పవన్ వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసింది రామోజీనే
- పవన్.. బాబు దగ్గర కాపులను ఎందుకు తాకట్టు పెడుతున్నావ్?
- కాపుల్లో ముఖ్యమంత్రులుగా పనికొచ్చేవారే లేరా?
12:15PM, Feb 9, 2024
పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతోంది: మంత్రి రోజా
- ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి?
- ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా?
- విశాఖలో ఆడుదాం ఆంధ్రా తుది పోటీలు ప్రారంభం
- పోటీలను ప్రారంభించిన క్రీడాశాఖ మంత్రి రోజా
- ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ
11:58AM, Feb 9, 2024
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై పేర్ని నాని కౌంటర్ అటాక్
- బీజేపీతో చంద్రబాబు అర్ధరాత్రి చర్చలు నడిపారు
- 2014లో ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అవసరమన్నాడు
- బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగాడు
- నాలుగేళ్లు కాపురం చేసి చివరి ఆరునెలల్లో బీజేపీ పై చంద్రబాబు బూతులు తిట్టాడు
- మోదీకి భార్యలేదన్నాడు
- కుటుంబం లేనోడు నాతో పోటీనా అన్నాడు
- ఈడీతో బెదిరిస్తావా.. ఏం చేస్తావో చేసుకో అన్నాడు
- బీజేపీతో ఎందుకు కలిసి పోటీచేయాలో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి
- బీజేపీ కొత్తగా ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేసింది
- ప్రత్యేక హోదా ఇచ్చిందా...రైల్వే జోన్ ఇచ్చిందా
- పోర్టు నిర్మాణం పూర్తిచేసిందా ...కడప స్టీల్ ప్లాంట్ కట్టిందాఝ
- పోలవరం పూర్తి చేయించి ఇచ్చిందా
- నిర్వాసితులకు ఈరోజుకీ నయాపైసా ఇవ్వలేదు
- దోసెడు పట్టి.. చెంబుడు నీరు ఇచ్చాడని చంద్రబాబే చెప్పాడు
- అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడు
- ఒంటరిగా జగన్‌ను గెలవలేక పవన్, బీజేపీలను తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
11:35AM, Feb 9, 2024
చంద్రబాబు స్క్రిప్ట్ చదివే షర్మిలను ఎవరూ నమ్మరు: మంత్రి రోజా
- షర్మిల గారికి ఒక సలహా ..మీరు రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి రేవంత్.. సోనియాలను అడగండి
- రాష్ట్రానికి రావాల్సిన 6 వేల కోట్ల నిధులు...ఉమ్మడి అస్థి గురించి రేవంత్‌ని అడగండి
- వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చిన పార్టీలో మీరు చేరారు
- 2024 ఎన్నికల తర్వాత నాన్ లోకల్ పొలిటీషియన్‌లు చంద్రబాబు.. పవన్.. లోకేష్.. షర్మిల తెలంగాణా పారిపోవడం ఖాయం
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా మ్యానిఫెస్టోతో సిద్దంగా వుంటే ప్రతి పక్ష పార్టీలు ఇంకా సిద్దంగా లేరు
- రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. మళ్లీ జగన్ సీఎం కావడం ఖాయం
11:37AM, Feb 9, 2024
విజయవాడ
ఆంధ్ర అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి నాయకులకు లేదు: దేవినేని అవినాష్
- రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీనే
- విభజన హామీలు పొందుపరచటంలో విఫలమైంది కాంగ్రెస్ నాయకులు కాదా?
- ఎడారిలో ఓయాసిస్ లాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దొరికారు
- రాష్ట్ర అభివృద్ధి చేయడంలో సఫలమైన జగన్ ప్రభుత్వం
- రాష్ట్రంలో అనేకమందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
- సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే జగన్ ప్రభుత్వం ప్రథమ స్థానంలో ఉంది
11:10AM, Feb 9, 2024
రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ. 6లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?:లక్ష్మీ పార్వతి
- చంద్రబాబు అంటేనే అవినీతి, అక్రమాలు
- ఆతని వలన రాష్ట్ర ప్రజలకు ఏ ప్రయోజనమైనా చేకూరిందా?
- ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది?
- కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు
- చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహంచాలి
- చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలోనూ ఉండకూడదని ఎన్టీఆర్ అన్నారు
- టీడీపీలో నుండి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి
- ఎల్లోమీడియాని ప్రజలు అసహ్యించుకుంటున్నారు
- కోర్టుల్లోని కేసులను కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు
- వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు దిట్ట
- అలాంటి వ్యక్తి వలన ప్రజలకు ఉపయోగం లేదు
- బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ పార్లమెంటులో చెప్పగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు
- గంటసేపు ఢిల్లీలో చంద్రబాబు కనపడలేదు, వెంటనే ఒక ఫేక్ సర్వే బయటకు వచ్చింది
- అలాంటి వ్యవహారాలు చేయటంలో చంద్రబాబు దిట్ట
- ఎన్నికలు వస్తుండటంతో రకరకాల వేషాలతో వస్తున్నారు
- వారందరికీ నాయకుడే చంద్రబాబే
- ఎన్టీఆర్ కీ, పిల్లలకీ మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు
- ఇప్పుడు జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టాడు
- పేదల అభివృద్ధి కోసం జగన్ ఎంత చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు
- చంద్రబాబు ఏనాడైనా పేదలను పట్టించుకున్నారా?
- విద్య, వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో చూశాం
- జగన్ లాంటి వ్యక్తిని మళ్ళీ సీఎం చేసుకోవాలి
- ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని అమిత్ షాతో కలవలేదు
- కలిస్తే ఆ ఫోటో చూపించాలి
- చంద్రబాబు అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారు
- చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు
- అందికే అన్నిసీట్లనూ కూడా బీజేపీకి ఇచ్చేందుకు కూడా సిద్దపడ్డారు
- కేసుల నుండి తప్పించుకోవటానికి చంద్రబాబు బీజేపీ తో కలవబోతున్నారు
- టీడీపీకి ఈ ఎన్నికలతో పెండింగ్ కార్డు పడుతుంది
- షర్మిల దారి తప్పిన బాణం
- చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే షర్మిల పని
- చంద్రబాబు, జనసేన మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు
- లోకేష్ వస్తే పార్టీకి నష్టమని సొంత పార్టీ వారే అంటున్నారు
8:30AM, Feb 9, 2024
పెందుర్తి సీటు.. నాకంటే నాకు..!
- టీడీపీ, జనసేనల మధ్య టికెట్ వార్
- జనసేనలో బయటపడ్డ తమ్మిరెడ్డి శివశంకర్- పంచకర్ల రమేష్‌బాబు మధ్య ఉన్న విభేదాలు
- జనసేన ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం అందలేదని శివశంకర్ వర్గం నిరసన
- కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తున్నారంటూ కార్యకర్తల ఆగ్రహం
- చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ప్రోటోకాల్ మర్యాదలు తెలియవంటూ అసంతృప్తి
- పెందుర్తి టికెట్ ఆశిస్తున్న రమేష్‌బాబు
- పొత్తులో ఆ టికెట్ జనసేనకు కేటాయిస్తే అది తనకే ఇవ్వాలంటున్న రమేష్‌బాబు
- ఈ మేరకు సోషల్ మీడియా లో ప్రచారం ముమ్మరం
- మరోవైపు రమేష్‌బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి
- టీడీపీకి ఇస్తే ఆ సీటు నాదే అంటున్న బండారు
- ఒకవేళ జనసేనకు ఇస్తే శివశంకర్‌కు ఇవ్వాలని డిమాండ్
8:10AM, Feb 9, 2024
రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే
- అసెంబ్లీ సాక్షిగా ‘కాగ్’ నివేదిక కుండబద్ధలు
- ఏపీ నెత్తిన రూ.2,57,612 కోట్ల రుణభారం మోపిన టీడీపీ సర్కారు
- దిగిపోయే నాటికి అదనంగా మరో రూ.14 వేల కోట్ల అప్పులు
- నిబంధనలకు విరుద్ధంగా నాడు ఎడాపెడా అప్పులు
- 2022–23 నాటికి బడ్జెట్‌లో అప్పు రూ.4,23,942 కోట్లు
- కార్పొరేషన్ల ద్వారా గ్యారెంటీల అప్పు రూ.1,38,875 కోట్లు
- ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, అప్పులు
- పరిమితి ప్రకారం ఇంకా అవకాశం ఉన్నా ఆచితూచి ప్రభుత్వం అడుగులు
- నేడు అప్పులు, గ్యారెంటీలు పరిమితులకు లోబడే ఉన్నాయని తేల్చిన ‘కాగ్’
- 2022–23 అకౌంట్స్‌పై శాసనసభకు కాగ్ నివేదిక సమర్పణ
7:40AM, Feb 9, 2024
జనం చెవిలో పూలు పెట్టేందుకే బాబు ఢిల్లీ పర్యటన: ఎమ్మెల్యే కొడాలి నాని
- లేని గొప్పతనాన్ని బీజేపీ పెద్దల చాటుకుని జనాన్ని మోసం చేయడానికే ఢిల్లీకి
- ఏళ్ల తరబడి బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు
- ఇన్నాళ్లకు కనికరించిన ఢిల్లీ బీజేపీ పెద్దలు
- రా.. రామ్మని బీజేపీనే ఆహ్వానించినట్లు ఎల్లో మీడియా బిల్డప్
- అవసరం కోసం బాబు ఎవరి కాళ్లైనా పట్టుకోవడానికి సిద్ధం
- గతంలో తన చేతిలో లేని కుల వర్గీకరణలను కూడా చేస్తానంటూ.. తీర్చలేని హామీలిచ్చిన బాబు
- కులా లు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపి లబ్ధి పొందే తత్వం బాబుది
- నీతినిజాయితీల కోసం, ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలు, పదవులను సైతం త్యాగం చేసే వ్యక్తి సీఎం జగన్
- అమూల్యమైన ఓటును సీఎం జగన్‌కు వేసి మరోసారి అధికారంలోకి తీసుకువద్దాం
7:10AM, Feb 9, 2024
ధిక్కార స్వరంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి
- ప్రత్తిపాడులో పైలా వర్గం తిరుగుబాటు
- అధిష్టానం తీరును నిరసిస్తూ మీడియా ముందుకు నెల్లూరు నేతలు
- పెడన నియోజకవర్గంలో ఎవరికివారే యమునాతీరే
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో బీసీలకు స్థానం దక్కలేదు
- జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు పార్టీ పదవులతోనే టీడీపీ సరిపెట్టింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీకి అవకాశం కల్పించలేదు.
- ఉదయగిరిలో జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబుయాదవ్ పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నా, ఆయన పేరునూ పరిగణనలోకి తీసుకోలేదు.
- గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థి దొరకలేదు. దీంతో చివరి నిమిషంలో మై నార్టీ నేత అబ్దుల్ అజీజ్‌కు అవకాశమిచ్చారు. ఆ సీటు పోతుందని తెలిసినా ఆయన బరిలో నిలిచారు. ఆటు పోట్లకు ఎదురొడ్డి నిలిచినా చివరికి మొండిచేయి చూ పారు. వెంకటగిరిలో మస్తాన్‌యాదవ్ కు పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేశారు.
- కావలిలో పసుపులేటి సుధాకర్‌ను నమ్మించి పార్టీ ఫండ్ సేకరించి హ్యాండిచ్చారు. నెల్లూరు పార్లమెంట్ స్థా నానికీ ఇదే తీరు
- వెంకటగిరి సీటు ను బీసీలకే ఇవ్వాలనే డిమాండ్‌తో బీసీ సంఘాలు డిమాండ్
7:00AM, Feb 9, 2024
ఏ మాత్రం విశ్వసనీయత లేని సీ-ఓటర్ సర్వే
- ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, గత ఏపీ ఎన్నికల్లో లెక్కలు తప్పిన ఆ సంస్థ
- దాన్ని పట్టుకుని టీడీపీ, ఎల్లో మీడియా చంకలు గుద్దుకోవడంపై విస్మయం
- కోతికి కొబ్బరి చిప్ప మాదిరిగా సీ–ఓటర్ సర్వే పేరుతో హడావుడికి తెర
- 2019లోనూ ఏపీలో ఇదే రీతిలో సర్వే.. తప్పిన లెక్కలు
- గత ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ
- తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ సీ–ఓటర్ అంచనాలు గల్లంతు
- ప్రజల నాడి పట్టలేక విశ్వసనీయత కోల్పోయిన సర్వే సంస్థ
6:40AM, Feb 9, 2024
జగనన్న ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు: హోంమంత్రి తానేటి వనిత
- ప్రభుత్వం ఏర్పాటైన కొద్దినెలలకే కరోనా విపత్తు రావడంతో ఆర్థికంగా ఉన్న దేశాలు కూడా అతలాకుతలం అయ్యాయి.
- సీఎం జగన్ తెలివిగా ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థతో పరిపాలన అందించారు
- ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తాం
- జనసేన-టీడీపీ గోదావరి జిల్లాలో బలంగా ఉంటే ఎందుకు పొత్తులు
6:35AM, Feb 9, 2024
చంద్రబాబు, పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రి రోజా
- ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేవు
- గట్స్ ఉన్న నాయకుడు సీఎం జగన్
- చంద్రబాబు, లోకేష్, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయి
- వయసులో చిన్నవాడైన అమిత్ షా కాలు పట్టుకోవడం సిగ్గుచేటు
- చంద్రబాబు మా చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు
6:32AM, Feb 9, 2024
బలహీనంగా ఉన్నారు కాబట్టే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు: సజ్జల
- తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది
- బీజేపీతో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలని బాబు చూస్తున్నారు
- పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తారు
- సీ ఓటర్ సర్వే విశ్వసనీయత ఏంటనేది ప్రజలకు తెలుసు
- ఐదేళ్లలో మేం చేసిన సంక్షేమం చెప్పి ఓట్లు అడుగుతున్నాం
- సీఎం జగన్ చేసిన అభివృద్ధే.. మరోసారి గెలిపిస్తుంది
- ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు
- చంద్రబాబు అద్దె మైకులా షర్మిల మాట్లాడుతున్నారు
6:30AM, Feb 9, 2024
బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు: ఎంపీ నందిగం సురేష్
ప్రధాని మోదీని తిట్టిన బాబు మళ్లీ బీజేపీ నేతల గుమ్మం దగ్గర నిలబడటం సిగ్గుచేటు
తాను ప్రజలకు చేసిందేమిటో చెప్పకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ దమ్ము చాలదని, బీజేపీ కాళ్లా-వేళ్లా పడుతున్నాడు
తన పాలనలో మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు జగన్
మేము చేసిన అభివృద్ధి పేదల ఖాతాలో ఉంది
చంద్రబాబు 14 ఏళ్లలో దోచుకున్నాడు
తన జీవితలో బాబు ఏనాడూ సొంతంగా పోటీ చేసి గెలవలేదు
చంద్రబాబు జిమ్మిక్కులతో సర్వేలు చేయించాడు
లగడపాటి లాంటి సర్వేలే ఇవి