
టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన.
జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్‌రీ రేటింగ్స్ కోసం టీవీ5లో అశ్లీల ప్రోగ్రామ్‌లు వేయలేదా?.. అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుంటే చర్యలేవీ? అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
బీఆర్ నాయుడు చీటర్. బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టీటీడీ చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడు అని అంబటి అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?. అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా?. అమరావతి మునకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు.
