కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం​ | Amid Telangana Assembly Session KCR BRSLP Meeting Updates | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం​

Mar 11 2025 11:44 AM | Updated on Mar 11 2025 3:19 PM

Amid Telangana Assembly Session KCR BRSLP Meeting Updates

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శాసనసభాపక్ష(BRSLP) సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ భేటీకి హాజరు అయ్యారు. ఇటు శాసన సభలో, అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ వాళ్లతో చర్చించనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైంలో బడ్జెట్‌ తన మార్క్‌ విమర్శలు గుప్పించారాయన. అయితే.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ పూర్తిగా హాజరు అవుతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. ఈ సెషన్‌ వాడీవేడిగా జరిగే ఛాన్స్‌ లేకపోలేదు.

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement