ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

మత్తు పదార్థాలతో జీవితం నాశనం చేసుకోవద్దు మంచి వైద్యులుగా ఎదగాలి రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా

కోల్‌సిటీ: విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, మానవతా విలువలు, పరస్పర గౌరవం, సేవాభావాన్ని అలవర్చుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)లో బుధవారం యాంటీ ర్యాగింగ్‌, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, వాటి వినియోగం, సరఫరాపై ఉన్న చట్టాలు, శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మంచి వైద్యులుగా ఎదగాలని సూచించారు. జూనియర్లను ర్యాగింగ్‌కు గు రిచేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ర్యాగింగ్‌తో పాటు మాదకద్రవ్యాల వినియోగం కూడా యువత భవిష్యత్తుకు ముప్పు అని హెచ్చరించారు. కొద్దిమంది విద్యార్థుల తప్పిదాలతో కళాశాల పేరు ప్రతిష్ట దెబ్బతినకూడదని సీపీ అన్నారు. సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను వేధించకుండా అండగా నిలవాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ దయాల్‌సింగ్‌, జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హిమబిందుసింగ్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ రేఖ, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, టాస్క్‌ఫోర్స్‌/నార్కోటిక్‌ ఎస్‌ఐ రమేశ్‌, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్‌, ఎస్‌ఐలు మనోహర్‌, రాజశేఖర్‌, వార్డెన్‌ ఓబులేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement