ఇది ఓదెల మండలం కొలనూరు గ్రామపంచాయతీ
కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనం. సుమారు పదేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. పాతభవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవన నిర్మాణం చేపట్టినా.. నిధుల కొరత, అధికారుల నిర్లక్ష్యమో తెలియదుకానీ.. భవనం ఇంకా పిల్లర్ల స్థాయి దాటడంలేదు.
భవనం..
పిల్లర్లకే పరిమితం
కాల్వశ్రీరాంపూర్: కొద్దిరోజులుగా చలితీవ్రత పెరుగుతూ
వస్తోంది. ప్రధానంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. బుధవారం రాత్రి కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో చలిమంటలు కాగుతున్న స్థానికులు ‘సాక్షి’ కెమెరాకు ఇలా చిక్కారు.
ఇది గుర్రపుబండి(టాంగా). ఆటోలు, కార్లు, బస్సులు లేని పాతకాలంలో ప్రయాణానికి ఈ బండినే వినియోగించేవారు. ప్రస్తుతం కొన్ని ప్రధాన నగరాల్లో అరుదుగా కనిపిస్తున్న టాంగా.. పెద్దపల్లిలో రాజీవ్
రహదారిపై పరుగులు తీస్తూ ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించింది. పెద్దపల్లి నుంచి నాగ్పూర్ వెళ్తున్నట్లు యజమాని తెలిపాడు.
చలి
పంజా
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


