పెద్దపల్లి: భారత విద్యా రంగానికి బలమైన పునాది వేసిన గొప్ప నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ శ్రీరాములు అన్నారు. కలెక్టరేట్‌లో బుధవా రం నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రఖ్యాత పండితుడు, కవి, అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ వంటి భాషల్లో కలాం ప్రావీణ్యుడని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


