కోల్సిటీ/ఫెర్టిలైజర్సిటీ: నగరంలోని 46, 36 డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మేయర్ మహంకాళి స్వామి బుధవారం భూమిపూజ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకుంటే త్వరితగతిన బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మేయర్ హామీ ఇచ్చారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కల్వల రంజిత్, కన్నూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
22వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూ మిపూజ చేసిన అనంతరం మేయర్ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి, వార్డు ఆఫీసర్ సాయికుమార్, నాయకులు బూర్ల శ్రీనివాస్, మనలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


