పెద్దపల్లిరూరల్: ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ‘న వార’ రకం వరి వంగడాలతో పంటను చీకురాయి లో సాగు చేసిన రైతు మొండెద్దుల జగన్ పొలాన్ని ఏడీఏ శ్రీనాథ్, ఏవో నాగార్జున తదితరులు బుధవారం సందర్శించారు. షుగర్ బాధితులు ఈరకం బియ్యాన్ని ఆహారంగా తీసుకునేందుకు ముందుకొస్తున్నారని రైతు తెలిపాడు. సేంద్రియ పద్ధతిన సాగు చేసిన రైతును వ్యవసాయాధికారులు అభినందించారు. దేశీయ పద్ధతిన పశువుల పేడ, మూత్రంతోనే పంట పండించడంతో ఆహారంగా తీసుకున్నవారు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓదెల శ్రీనివాస్, ఏఈవో సౌమ్య, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


