విద్యార్థులను సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను సిద్ధం చేయాలి

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

ధర్మారం/పెద్దపల్లి: జాతీయస్థాయి మూల్యాంకనానికి విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. రచ్చపల్లి ప్రాథమి క పాఠశాల హెచ్‌ఎం వంశీమోహనాచార్యులు రూపొందించిన పరక్‌ జాతీయ ముల్యాంకన పుస్తకాన్ని బుధవారం కలెక్టర్‌ ఆవిష్కరించి మా ట్లాడారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు వినూత్నన బోధన పద్ధతులు అవలంబించాలన్నా రు. హెచ్‌ఎం రూపొందించిన ప్రశ్నపత్రాలను పరిశీలించిన కలెక్టర్‌.. క్లిష్టంగా ఉండే 25 అంశాలను ఎంపిక చేశారు. డీఈవో శారద, అకడమి క్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ షేక్‌, హెచ్‌ఎం సమూద్రాల వంశీమోహనాచార్యులు పాల్గొన్నారు.

మత్తు జోలికి పోవద్దు

సుల్తానాబాద్‌రూరల్‌: విద్యార్థులు మత్తుతో జీ వితాలను నశనం చేసుకోవద్దని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. డ్రగ్స్‌, మత్తు పదార్థాల తో కలిగే అనర్థాల గురించి గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌లో బుధవారం అవగాహన కల్పించా రు. విద్యార్థులు మంచి లక్ష్యాలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. సీఐ రంజిత్‌రావు, ఎస్సైలు చంద్రకుమార్‌, మధుకర్‌, సుధాకర్‌, ప్రిన్సిపాల్‌ గోల్డి బల్బీర్‌కౌర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

గంజాయి రహిత జిల్లా లక్ష్యం

ఓదెల: గంజాయి రహిత జిల్లా నిర్మాణమే ల క్ష్యమని డీసీపీ రాంరెడ్డి అన్నారు. ఓదెల మో డ ల్‌ స్కూల్‌లో గంజాయి నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సర్పంచ్‌ కనికిరెడ్డి సతీశ్‌, కళాకారుడు మహరాజ్‌ ఎస్‌పీ నాయక్‌, సీఐ రంజిత్‌రావు, ఎస్సైలు సనత్‌రెడ్డి, సుధాకర్‌, ప్రిన్సిపాల్స్‌ శీరి ష, అమరేందర్‌, ఎస్‌వో జ్యోతి పాల్గొన్నారు.

పైప్‌లైన్‌ లీకేజీలు అరికట్టాలి

కమాన్‌పూర్‌: గ్రామాల్లో తాగునీటి పైపులైన్ల లీ కేజీలను గుర్తించి మరమ్మతు చేయాలని ఇన్‌ ట్రా డీఈ రాజ్‌కుమార్‌ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రి యాంక అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ఎల్‌నీవో నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్య లు తీసుకోవాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులకు సూచించారు. మిషన్‌ భగీరథ డీఈ ఖలీల్‌ హమ్మద్‌, ఏఎంసీ చైర్మన్‌ వైనాల రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనగంటి భాస్కర్‌రావు, ఏఈలు పాల్గొన్నారు.

ఏఎంసీకి పర్సన్‌ ఇన్‌చార్జి

కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ వ్యవసా య మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ) పర్సన్‌ ఇన్‌చా ర్జిగా సిద్దిపేట మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.ప్రకాశ్‌ను నియమించారు. ఈమేరకు ఆయ న బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు డీ ఎంవో ప్రవీణ్రెడ్డి తెలిపారు. వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ పాలకవర్గం పదవీకాలం గతనెల 28న తేదీన ముగిసిందని, దీంతో ప్రకాశంను పర్సర్‌ ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఆయన వివరించారు.

మట్టిపాత్రలతో ఆరోగ్యం

మంథనిరూరల్‌: ప్లాస్టిక్‌, అల్యూమినియం పా త్రల వినియోగంతో క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులబారిన పడుతున్నామని, మట్టిపాత్రలు వాడితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామ ని కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షు డు టీకే శ్రీనివాస్‌ అన్నారు. కుంబార్‌ స్వశక్తి కి రణ్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామోద్యోగ వి కాస్‌ యోజన ద్వారా కుమ్మర యువకులకు సూరయ్యపల్లిలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, మన పూర్వీకులు మట్టిపాత్రలనే వాడటంతో ఆరోగ్యంగా ఉండేవారన్నారు. శిక్షణ ద్వారా యువకులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఆధునిక మట్టి పాత్రలను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆషాడపు లింగయ్య, ప్రధాన కార్యదర్శి కటికనపల్లి రవీందర్‌, ఇన్‌స్ట్రక్టర్‌ రాతిపల్లి నగేశ్‌, ప్రతినిధులు రేపాక శంకర్‌, రాములు, కల్వచర్ల రా జేందర్‌, ఇందారపు రాజు, శ్రీనివాస్‌, మల్ల య్య, రవీందర్‌, రవళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement