నాలుగేళ్లుగా పరుపులు కరువు | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా పరుపులు కరువు

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

మంథని: స్థానిక వసతి గృహంలో వంద మంది విద్యార్థులకు సుమారు 40 మంది ఉన్నారు. నాలుగేళ్ల క్రితం సరఫరా చేసిన పరుపులు అక్కరకు రాకుండా పోయాయని, కొత్తవాటి కోసం ఎదురుచూస్తున్నామని విద్యార్థులు తెలిపారు. చలిగాలులకు మంచాలు చల్లగా మారి నిద్ర పట్టడం లేదని ఆవేదన చెందారు. మరోవైపు.. ఆయా మండలాల హాస్టళ్ల విద్యార్థుల కోసం నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వసతి గృహంలో మంథని తహసీల్దార్‌ కార్యాలయం కింది వైపు, పైఅంతస్తులో మేనేజ్‌మెంట్‌ వసతి గృహం కొనసాగుతోంది. సమీకృత బాలికల వసతి గృహం విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. మూడింటికీ మరుగుదొడ్లు అవే కావడంతో నిర్వహణ గాడితప్పి కంపు కొడుతున్నాయి. వాచ్‌మెన్‌ అందుబాటులో లేరు. సంరక్షకులు సక్రమంగా విధులకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement