పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వేగేట్ సమీపంలో బుధవారం గూడ్స్ రైలు ఇంజిన్ నిర్ణీత డెడ్‌లైన్‌ను దాటి ముందుకు వెళ్లడం కలకలం రేపింది. రైళ్ల రాకపోకల నేపథ్యంలో బోగీలను ఒక లైన్ నుంచి మరోలైన్‌కు మార్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాజీపేట జంక్షన్ నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కూనారం గేటు వద్దకు రాగానే అదుపు తప్పడంతో లోకోపైలట్ అప్రమత్తమయ్యారు. ఇంజిన్ డెడ్‌లైన్ దాటిన విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులూ వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు. ఇంజిన్‌ను యథాస్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇంజిన్ డెడ్‌లైన్ దాటడానికి గల కారణాలపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అధికారులే ప్రజల వద్దకు రావాలి
రామగిరి: ప్రజలు తమ హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా పోరాటం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బుధవారం రాజాపూర్ గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, పుల్లెల కిరణ్, కలవేన సదానందం, జాపతి శేఖర్, బొంకూరి పోచం, ఆసం తిరుపతి, రేండ్ల కుమార్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాకు ప్రణాళిక
రామగిరి: ఎల్‌నినోతో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యా చరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధ వారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శైలజారాణి ఆధ్వర్యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావే శం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితి, నీటివనరుల లభ్యత, సమస్యలపై చర్చించారు. సమస్యలు గుర్తించి సకాలంలో పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


