సుల్తానాబాద్‌రూరల్: కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం డబ్బులు 24గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నర్సయ్యపల్లి, బొంతకుంటపల్లి, గర్రెపల్లి, భూపతిపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఉదళారులను నమ్మి మోసపోవద్దన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్‌పర్సన్ కల్లెపల్లి జానీ, సర్పంచులు తిరుమల్‌రావు, శ్రీరంగారావు, రమేశ్‌గౌడ్, చిన్నయ్య, సీఈవో నబియొద్దిన్, రైతులు పాల్గొన్నారు.
సన్నవడ్లకు మద్దతు ధర, బోనస్
ఎలిగేడు: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సన్నవడ్లకు మద్ధతు ధర లభించడంతోపాటు క్వింటాల్‌పై రూ.500బోనస్ వర్తిస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. బుర్హాన్‌మియాపేట, సుల్తాన్‌పూర్, నారాయణపల్లి, ర్యాకల్‌దేవుపల్లి, రాములపల్లిలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. ఎల్‌నినోతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలని ఆయన సూచించారు. అనంతరం బుర్హాన్‌మియాపేట, నారాయణపల్లి, నర్సాపూర్, ర్యాకల్‌దేవుపల్లి, రాములపల్లి గ్రామాల్లో మహిళా సంఘం భవనాలకు ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశారు. ఎలిగేడు సింగిల్‌విండో చైర్మన్ సామ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పొట్యాల రమేశ్, వైస్‌చైర్మెన్ కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుగ్యాల సంతోష్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఏలేటి వెంకట్‌రెడ్డి, సర్పంచులు కప్పల ప్రవీణ్, గోపు రజిత, సిద్ది తిరుపతియాదవ్, మద్దెల రమాదేవి, పల్లెర్ల వెంకటేశ్‌గౌడ్, మారం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


