యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే సర్క్యులర్లను రద్దు చేయాలని ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యాంరెంటీలను నేరవేర్చుతున్నామని, కొత్త గనుల తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నామని అన్నారు. బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధకార్మికుల రక్షణ విషయంలో ఆర్జీ–2ఏరియా యజమాన్యం ప్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎండీ ఆక్రమ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్, నాయకులు సదానదం, సంపత్‌రెడ్డి, మల్లేశ్, మార్కెం డేయ, సమ్మయ్య, అవినాష్, అశోక్, ఇంద్రసేనారెడ్డి, దిలీప్, తిరుపతి, శ్రీనివాస్, అజయ్ పాల్గొన్నారు.


