డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పంపిణీపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పంపిణీపై దృష్టి

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● నిర్మాణాలు ప్రారంభించి దశాబ్దం ● కాంట్రాక్టర్‌కు అందని బిల్లులు ● ఏళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు ● కసరత్తు చేస్తున్న యంత్రాంగం

రామగుండం: అంతర్గాం డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లకు 2016లో నిర్వహించిన గ్రామసభల్లో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 2017 ఫిబ్రవరిలో భూసేకరణ చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. తొలివిడత 2018లో కుందనపల్లిలో – 20, అంతర్గాంలో – 60, లింగాపూర్‌లో 20, రాయదండిలో –20, ఎగ్లాస్‌పూర్‌లో –20, రెండోవిడత 2019లో కుందనపల్లిలో –10, బ్రాహ్మణపల్లిలో –30, ఆకెనపల్లిలో –20, లింగాపూర్‌లో –5, రాయదండిలో –10, ఎగ్లాస్‌పూర్‌లో–10, మద్ధిర్యాలలో –20, ముర్మూర్‌లో –10, గోలివాడలో –30, పొట్యాలలో–10, మూడోవిడత అక్టోబర్‌ 2021లో రాయదండిలో –30, ఎల్లంపల్లిలో –10, మద్ధిర్యాలలో –20, ముర్మూర్‌లో–10 మందిని ఎంపిక చేశారు. కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కాకపోవడం, బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు దశాబ్దంగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement